Saturday, April 2, 2011

మన సమితికి దేవాలయానికి మాత్రం సంబంధం లేని ఒక భక్తుడి వెయ్యిన్నొక్క రూపాయల విరాళం తో వీణాపాణి కి ఆదరణ మొదలై మన సేవ సమితి సభ్యుల భక్తి తో అది సముద్రమంతగా మారింది. అందుకే పదహారు పేజీలతో మొదటి బులెటిన్ మొదలై సంచిక తో అది ముప్పై రెండు పేజీలుగా ఎదిగింది. ఆద్యాత్మిక వేశేషాలతో పాటుగా సాహిత్యం మరియు మన భారతీయులకే సొంతమైన ఆయుర్వేద రహస్యాలతో వేసవి బులెటిన్ సంపూర్ణంగా ముస్తాబయ్యింది. భక్తులంత తమ అమ్మతో తాము పొందే అనుభూతుల్ని తమ గురువు గారితో తమకు గల అనుబంధాన్ని అనుభావాన్లి పంచుకునే గొప్ప అవకాశంగా బులెటిన్ ఉండబోతోంది. భక్తుల నుంచియే కాకుండా ఇంకా చాల వ్యాస కర్తల నుంచి మనం ఎన్నో గొప్ప రచనలను ఆశిస్తున్నాము. వీణాపాణి మీది, మనందరిది. దీనిని ఆదరించి ఆధ్యాత్మిక ప్రపంచంలో మన జీవితాలకు ఒక మార్గదర్శనంగా మారాలంటే దీనిని మనము ప్రతి ఒక్కరం కనీసం ఒక ఐదుగురుకి పరిచయం చెయ్యాలి. రాబోయే కాలం లో వీణాపాణి ఆధ్యాత్మిక చింతనకు ప్రతిరూపంగా నిలుస్తూనే మన సేవ సమితి కార్యక్రమాలకు దేవాలయ ధర్మ ప్రచారానికి ఒక సాధనముగా, వేదికగా నిలుస్తుందని నమ్ముతూ, ......శుభంభూయాత్...

No comments:

Post a Comment