Friday, July 9, 2010

అహం బ్రహ్మాస్మి -అష్టకాల విద్యాచరణ్


యజ్ఞయాగాదులు లోకకళ్యాణార్థము ఉద్దేశించి చేసేవైతే, మంత్ర జప పారాయణాలు మాత్రం మానవుని వ్యక్తి గత, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడేవి. స్తోత్ర పారాయణము మానవుణ్ణి దైవ కృపకి ప్రాప్తున్ని చేయడమే కాక, తమ జీవితం పట్ల సరైన దృక్పథం కలిగే అవకాశం కల్పిస్తుంది. జ్ఞానాన్నిస్తుంది. మానవుణ్ణి సృష్టి లోని మిగతా ప్రాణులనుంచి వేరు చేసి ప్రత్యేకంగా నిలపెడుతుంది. విశ్వం లో ఈ ధరిత్రికి ప్రతినిధి గా గుర్తింపునిస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. భూసురుల్ని చేస్తుంది. ఏకంగా బ్రహ్మనే చేస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్న మాటకి మూల సూత్రం అదే.

వేద విద్యా పారంగతులైన మన మహర్షులు తమ తపశ్శక్తినంత క్రోడీకరించి మంత్ర మూలాలైన బీజాక్షర సహితంగా విరచించి మనకందించిన విజ్ఞానాయుధాలు, అందునా జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతి దేవి స్త్రోత్రములన్ని ఒక్క చోట చేర్చి అందరికి అందించడము ద్వారా లోక కల్యాణం సాధించడం కూడా ఒక మహా యజ్ఞమే!! అలా ఇరవై ఏళ్ళ క్రితం ప్రారంభించ బడ్డ ఈ క్రతువు మరిన్ని హృదయాలకు స్వాంతననందిచాలన్న చిన్ని తపనే ఈ మలి ముద్రణ.

"సర్వే సుజనా సుఖినో భవంతు"

Sunday, June 20, 2010

ఇది చూడాల్సిన వెబ్ సైట్ !!!

THis is a wonderful website for surfing through lot of discussions on aham..

www.aham.com

Unfortunately the founder of this AHAM India Centre Mr. A. Ramana has passed away recently. But he has left lot of things to persue and follow for the human kind.

AHAM= Association of Happiness for All Mankind...

Friday, June 18, 2010

విశ్వంభర - మనిషి జీవన ప్రస్థానాన్ని తన కోణంలో ఆవిష్కరించిన సి నా రే

మనసొక వృక్ష మూలం అది చేదుకుంటుంది జీవన సారం... మనిషి, ఈభూమి మీద అవతరించిన తీరు, మరల తన మనసుకు తనే బానిసైన తీరు, మనిషి మనిషి పై సాగించే అధికారం, చేసే కుతంత్రం, మళ్లీ తన ఛట్రం లో తానే బందీ అయ్యి బలియై పోవడం సి నా రే తనదైన శైలిలో పొందుపరచిన ఈ ఖండ కావ్యం నిజ్జంగా ఒక మనిషి కి సెల్ఫ్ analysis కి ఇది ఒక చెక్ లిస్టు లాంటిది. అందుకే జ్ఞాన పీఠ్ అవార్డు కి ఎంపికైంది. చదివి పదేళ్ళైనా ఇంకా నిన్నే చదివినట్టుంది. ఈరోజు పుస్తాకాల మధ్య మళ్లీ కనిపించి నా జ్ఞాపకాల పొరల్లో మనిషిని గుర్తు చేసిన క్షణం ఇది.

Thursday, June 17, 2010

హాయ్,
ఇవి మా నాన్న తమిళనాడు ముఖ్యమంత్రి రాముడి మీద చేసిన కామెంట్స్ కి రియాక్షన్ ప్రతి రామ భక్తుడు చదవాల్సిందే !!!

Aham Brahmasmi-

If u realize what u are…U are Brahma…But who is Brahma… హి, who knows the reality of life..life everywhere…hence few call him creator. You are the creator of your own life, luck, death and yourself in it…. creator of your own destiny.
To realize oneself, one has to come out of him/herself and observe, analyze, criticize, blame, praise, love & hate the facts visible and come to conclusion on what is real. That gives one a choice of ignoring the result or to act on it and modify/change the path if required. Define the destiny, plan the path, face the challenges, and reach it. Then one can proudly say “AHAM BRAHMASMI”