Saturday, July 2, 2011

అందరి బంధువు



అందరి  బంధువు
 ఒకసారి కంచి స్వామి ఉత్తర దేశ యాత్రలో ఉన్నప్పుడు ఓ భక్తుడు గా ట్ట!!!. "స్వామీ ! దశావతారాలన్నీ పరిశీలిస్తే అన్ని అవతారాలు కేవలం ఉత్తరభారతం లోనే ఉన్నాయి అలాగే దక్షిణ భారతమంతా కేవలం ఎక్కువగా స్వాములు సన్యాసులు అవతరించారు ిఅంటే దేవుడికి దక్షిణ భారతం అంటే ఇష్టం లేదంటారా?" అని వింత ప్రశ్న అడిగాడట . దానికి స్వామి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నారట. " అయ్యా మీ పరిశీలన ఉత్తమమైనదే !. అవతారాలన్నీ దుష్ట సంహారానికి ఉద్దేశ్యించినవి అంటే దేవుడే స్వయంగా వచ్చి దండిస్తే కాని బహుశా మనుషులు మారరేమో!! అదే దక్షిణభారతం లో భక్తులు  కేవలం స్వాములు చెప్పే మంచి మాటలు,  ప్రవచానలవల్ల వారి జీవితాలు ప్రభావితం చేసుకుంటారు. అందుకే దేవుడికి అవతారాల అవసరం రాలేదనుకుంటా"...అని ముగించారు.

గురుశిష్య పరంపర మన జాతికి మూలాధారం. అడుగడుగునా మనకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని, గురువు యొక్క ప్రభావం మనమీద వారి ఆశీర్వచన రూపం లో ఉంటూ  మనకి దివిటీలా మార్గనిర్దేశం చేస్తుంది. గురువు మనసెప్పుడు మంచి శిష్యుల చూట్టునే తిరుగుతుందనిపిస్తుంది. నిజానికి ఉత్తమమైన శిష్యుల ఆత్మ బంధం నుంచి స్థితప్రజ్ఞులు, బ్రహ్మజ్ఞానులైన గురువులు కూడా తప్పించుకోలేరేమో. మనకి వీరబ్రహ్మం, సిద్దప్ప కధ విన్నాషిర్డీ బాబా కథ విన్నా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

గురువు అందరి శిష్యులకు ఆత్మ బంధువు. వారి ఆశీర్వాదం అందరికి సమానం. కానీ శిష్యుల పొందే ఫలంలో తేడా కేవలం వారి నమ్మకం, పట్టుదల,  సాధన లో వ్యత్యాసం వల్లే. ఒక గురువు తమ ప్రబోదాల్ని అందరికి సమానంగా పంచుతాడు. గురువు ప్రేమ ప్రపంచమంత విశాలం అది అందరికి మనసులో స్థానాన్ని కల్పిస్తుంది. కోపం  అగ్ని లాంటిది. అది మనం తప్పు చేస్తే దండించి మనల్ని  పునీతులుగా చేసే బడబాగ్ని. మన బాధలన్ని తనవిగా చేసుకుని, ఉపశమనం కలిగించే ధన్వంతరి. ధనిక పేద అనే తారతమ్యం లేకుండా, ఏమాత్రం స్వార్థం లేకుండా, ఏ ఫలాపేక్ష లేకుండా   అందర్నీ అక్కున చేర్చుకుని లాలించే  వ్యక్తిత్వం కేవలం ఒక్క గురువుకే సాధ్యం.

 గురు సేవ పరమపద సోపానానికి మొదటి ఆటలోనే పెద్ద నిచ్చెన వంటిది. నిత్యం గురు స్మరణవారు ఆశయాల ఆచరణ చేసే ప్రతి శిష్యుడు ఎక్కడ ఉన్న గురువు మనసు అతడిని వెంటాడుతూనే ఉంటుంది.  అతన్ని నిత్యం కాపాడుతూనే ఉంటుంది. మానవుడికి సంస్కారమనే ఆయుధాన్ని, జ్ఞానమనే సంపదని అందించి, మన విజయమే తన పరమానందంగా భావించి, మనల్ని అసామాన్యులుగా మలచి తను సామన్యుడుగా మిగిలిపోయే  అజ్ఞాత శక్తిగురువు.  కనిపించే దైవం గురువు. మన మేలే తప్ప తన గురించి తాను పట్టించుకోని గురువుకి , మన వంతు సేవగా మనమేం చేస్తున్నాం?. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండ విహార  యాత్ర  మాత్రం జరుపుకుంటాం. కాని ఒక్కరమైనా ఈ ౩౬౫ రోజుల్లో కనీసం ఒక వారం రోజులు గురు సేవలో తరిద్దామన్న ఆలోచన చేసిన వారున్నారా అని మనల్ని మనం గుండె మీద చేయి వేసుకుని అడగాల్సిన ప్రశ్న. పూర్వజన్మ సుకృతం వల్లే అది సాధ్యము. అందుకే కనీసం "గురుపూర్ణిమ" రోజైనా గురువు పాదాలకు నమస్కరించి వారి చల్లని నీడలో గడపాలని ఈ పరంపర మన సంస్కృతిలో ఒక భాగంగా మన పెద్దలు అనుసరించారు . దానికి సమయం లేని వారిని ఆ దేవుడు కూడా రక్షించలేడెమో . అమంగళం ప్రతిహతమవుగాక....   

ధ్యాన:  మూలం  గురుర్  మూర్తి:  పూజ:  మూలం  గురు  పదం
మంత్ర  మూలం  గురుర్  వాక్యం  మోక్ష:  మూలం  గురు  కృప:
                                                                                                                                                                                                                                                                        గురుపూర్ణిమ సందర్భంగా ....

No comments:

Post a Comment